ప‌వ‌న్‌పై ఏపీ డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు… ఆ రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంది…

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు, వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న‌ది.  ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ వార్ జ‌రుగుతున్న‌ది.  ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు, మంత్రులు వ‌ర‌స‌గా కామెంట్లు చేస్తున్నారు.  తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  వైసీపీని, సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శంచే అర్హ‌త ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు లేద‌ని అన్నారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీలో చేరేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేశార‌ని, అందుకు జ‌గ‌న్ ఒప్పుకోక‌పోవ‌డంతో ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ ప‌థ‌కాల‌ను చూసి ఈర్ష్య‌ప‌డుతున్నార‌ని,  ఈర్ష్య‌తోనే సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని తెలిపారు.  ప‌వ‌న్‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి పేర్కొన్నారు.  ఈరోజు ఉద‌యం డిప్యూటీ సీఎం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు.  అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా విమ‌ర్శ‌లు చేశారు.

Read: సిద్ధూపై కెప్టెన్ ఫైర్… కాంగ్రెస్‌ను నిండా ముంచేశాడు…

-Advertisement-ప‌వ‌న్‌పై ఏపీ డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు... ఆ రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంది...

Related Articles

Latest Articles