మద్యం కావాలనే ఉద్యమానికి చంద్రబాబు నాయకుడు…

నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య వ్యాపారం చేసే వాళ్ళకే బ్రాండ్లు, ధరల గురించి తెలుస్తుంది అని చెప్పారు.

ఇక బోండా ఉమ మద్యం బాటిళ్లు పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఏం సందేశం ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో ఉన్న 43వేల బెల్టు షాపులను రద్దు చేశాం. మద్యం కావాలనే ఉద్యమానికి చంద్రబాబు నాయకుడు. లిక్కర్ మాఫియాలో చంద్రబాబు పాత్ర ఉంది. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మకాలు జరుగుతుంటే డబ్బులు నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయనే ఆరోపణలకు అర్థం ఉందా అని అడిగారు. మద్యం నియంత్రణ, మద్యం నిషేధానికి మధ్య పెద్దగా తేడా లేదు. రెండు, మూడు నెలల్లో పూర్తి స్థాయిలో మద్య నియంత్రణ జరుగుతుంది. చంద్రబాబు నాణ్యమైన రోడ్లు వేయకుండా దోపిడీ చేయటం వల్లే రెండు, మూడేళ్ళకే రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇతర కులాలకే కాదు కమ్మ కులానికి కూడా చంద్రబాబు ఏం చేయలేదు అని అన్నారు నారాయణ స్వామి.

Related Articles

Latest Articles

-Advertisement-