టీడీపీ నాయకులది వక్రబుద్ధి : ధర్మాన కృష్ణదాస్

రైతు దినోత్సవాన్ని రైతు దగా దినోత్సవంగా అభివర్ణించడం బాధాకరం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంటే… టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. రైతులను టీడీపీ నాయకులు మభ్యపెడుతున్నారు. గతంలోనూ నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది వక్రబుద్ధి అని తెలిపారు ఆయన. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తే..ప్రజలు వారికి ఎన్ని స్థానాలు ఇచ్చారో తేలిపోతుంది. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ తిరుపతి ఎన్నికల్లో ప్రచారం చేశారు. మా అధినేత ఎలాంటి ప్రచార హోరు లేకుండానే తిరుపతిని కైవసం చేసుకున్నాం. జనంలో టీడీపీ నేతలు విశ్వాసం కోల్పోయారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-