కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్‌ లేఖ…

కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్‌ ఆదిత్య నాధ్ దాస్ లేఖ రాసారు. ఆ లేఖలో… మరో మార్గం లేకే సుప్రీంకు. ఇది కేంద్రానికి వ్యతిరేకం కాదు. కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోంది. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాల్లో నీటి వినియోగంపై ఉన్న విధి విధానాలను ఉల్లంఘిస్తూ జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2014 విభజన చట్టం సహా తెలంగాణ అన్నింటినీ ఉల్లంఘిస్తోంది అన్నారు.

ఇక శ్రీశైలంలో నీటిమట్టాలు నిలబడకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రావిటీ ద్వారా నీరు పొందేందుకు శ్రీశైలంలో ఉండాల్సిన +854 అడుగుల నీటి మట్టాన్ని నిలబెట్టడమే కష్టమవుతోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించలేం. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా సాగర్‌, పులిచింతల నుంచి తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ఏపీకి ఉన్న కేటాయింపుల ప్రకారం నీటిని ఇవ్వకుండా ఉండేందుకు, నీటి విడుదల ఆలస్యం చేసే వ్యూహంలో భాగంగానే తెలంగాణ ఇలా వ్యవహరిస్తోంది. కేఆర్ఎంబీ పరిధిని త్వరగా తేల్చండి. ఉమ్మడి జలాశయాలకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలి అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-