ఏపీలో తగ్గని కరోనా జోరు.. ఇవాళ కొత్తగా 1502 కేసులు

ఏపీలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63, 717 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1525 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,19,702 కు పెరగగా… రికవరీ కేసులు 19,90,916 కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,903 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 14,883 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2, 68, 73, 491 గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Related Articles

Latest Articles

-Advertisement-