ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…

ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది.  కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  24 గంట‌ల్లో 47,884 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 4,348 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 20,92,227 కి చేరింది.  ఇందులో 20,63,516 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఇద్ద‌రు మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 14,507 మంది మృతి చెందిన‌ట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.  24 గంట‌ల్లో 261 మంది కోలుకున్న‌ట్టుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి.  

Read: ఒక డైరెక్టర్ కి విడాకులిచ్చి.. మరో డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన హీరోయిన్

గ‌డిచిన 24 గంట‌ల్లో అనంత‌పూర్‌లో 230 కేసులు, చిత్తూరులో 932, తూర్పు గోదావరిలో 247, గుంటూరులో 338, క‌డ‌ప‌లో 174, కృష్ణాలో 296, క‌ర్నూలులో 171, నెల్లూరులో 395, ప్ర‌కాశంలో 107, శ్రీకాకుళంలో 259, విశాఖ‌ప‌ట్నంలో 823, విజ‌య‌న‌గ‌రంలో 290, ప‌శ్చిమ గోదావ‌రిలో 86 కేసులు న‌మోద‌య్యాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం ఈనెల 18 వ తేదీ నుంచి నైట్ క‌ర్ఫ్యూను అమ‌లులోకి తెస్తున్న సంగ‌తి తెలిసిందే.  

Related Articles

Latest Articles