ఏపీ కరోనా బులెటిన్… కొత్త కేసులు ఎన్నంటే?

ఏపీలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతూనే ఉన్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 31,473 శాంపిళ్లను పరీక్షించగా 222 మందికి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారింపబడింది. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,738కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది కరోనాతో కోలుకున్నారు. ఇంకా ఏపీలో 2,560 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,53,738 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు:
శ్రీకాకుళం 6, విజయనగరం 2, విశాఖ 35, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరి 22, కృష్ణా 31, గుంటూరు 38, ప్రకాశం 5, నెల్లూరు 24, చిత్తూరు 28, అనంతపురం 3, కర్నూలు 1, కడప 10.

ఏపీ కరోనా బులెటిన్... కొత్త కేసులు ఎన్నంటే?

Related Articles

Latest Articles