కడప జిల్లాలో సీఎం రెండు రోజుల టూర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు, ఎల్లుండి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు సీఎం వైఎస్‌ జగన్.. ఎల్లుండి ఉదయం సీఎం సతీమణి భారతి తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా పులివెందుల తోటలోని గంగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

-Advertisement-కడప జిల్లాలో సీఎం రెండు రోజుల టూర్..

Related Articles

Latest Articles