మరోమారు పోలవరం ప్రాజెక్టుకు సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తోంది.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. పూర్తి చేసిన పనులను పరిశీలించి.. ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను నుంచి సమాచారం తీసుకుని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఇక, మరోసారి పోలరవం ప్రాజెక్టు డ్యామ్‌ సైట్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్‌.. ఈ నెల14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు పోలవరం ప్రాజెక్టుకు చేరుకోనున్నారు సీఎం జగన్‌.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు ఇప్పటికే పోలవరం వెళ్లారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఇంజినీర్ ఇన్ చీఫ్, జిల్లా ఎస్పీ.. ప్రాజెక్ట్ దగ్గర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-