ఈ నెల 14న పోలవరానికి జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 14న ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి పోలవరం పర్యటనకు వెళ్ళనున్నారు. దీంతో జిల్లా అధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 14న ఉదయం పది గంటలకు పోలవరం పర్యటనకు వెళ్ళనున్నారు. సీఎంతో పాటు జలవనరుల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పోలవరంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, ఇతర అధికారులు పోలవరం వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు.

read also : స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాదు :సోము వీర్రాజు

పోలవరం ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత ప్రాజెక్టు క్యాంపు ఆఫీసులోనే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. గతేడాది డిసెంబర్‌లో సీఎం జగన్‌ పోలవరం వెళ్లి ప్రాజెక్టు పనుల పరోగతిని పరిశీలించారు. దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ పోలవరం వెళుతున్నారు. వర్షాల సీజన్‌ కావటంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 27 మీటర్ల దగ్గర నీటి మట్టం కొనసాగుతోందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా కాఫర్‌ డ్యామ్‌ ఎగువన ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించే పనులు జరుగుతున్నాయి. నిర్వాసితుల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-