సీఎం జగన్ రెండు రోజుల తిరుపతి పర్యటన…

రేపటి నుంచి సీఎం జగన్ రెండు రోజులు తిరుపతిలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరనున్నారు సీఎం జగన్‌. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి. 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి బర్డ్‌ హాస్పిటల్‌ లో చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకోనున్న సీఎం జగన్… స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పలు ఇతర కార్యక్రమాలలో పాల్గొని రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు ముఖ్యమంత్రి.

-Advertisement-సీఎం జగన్ రెండు రోజుల తిరుపతి పర్యటన...

Related Articles

Latest Articles