స్కిల్‌ డెవలప్‌మెంట్‌, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సీఎం సమీక్ష

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండాలని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న ఆయన.. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐవోటీ లాంటి అంశాల్లో స్కిల్ కాలేజీల్లో బోధన, శిక్షణ ఉండాలన్నారు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఉండాలని.. తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలని సూచించారు.. ఇక, టెన్త్‌ డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యాలను పెంపొందించడం పై దృష్టి పెట్టాలని సూచించారు ఏపీ సీఎం.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆయన.. నైపుణ్యం లేని మానవవనరుల వల్ల కొన్నిచోట్ల మురుగు నీరు శుద్ధిచేసే ప్లాంట్లు సరిగ్గా నడవడంలేదన్నారు.. నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేశారు.. ప్రతి నెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో ఐటీఐలు సమావేశమయ్యేలా చర్యలు తీసుకోవాలని.. నిపుణుల బోధనలను డిజిటల్‌ పద్ధతిలో రికార్డు చేయాలని తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

Related Articles

Latest Articles

-Advertisement-