వ్యాక్సిన్ స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో తెలియ‌దు..!

ప్ర‌స్తుతం 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సాగుతోంది.. ఇప్ప‌టికే వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తోంది.. ఇక‌, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారు కూడా యాడ్ కానున్నారు.. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అపాయింట్లు మాత్రం ఇవ్వ‌డం లేదు.. ఇక‌, కోవిడ్‌ వాక్సినేషన్‌పై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్‌ మాత్రమే ఒక పరిష్కారంగా ఉంద‌న్న ఆయ‌న‌.. వ్యాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. దేశంలో వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు.. వాటిలో కోటి వాక్సిన్లు కోవాగ్జిన్, మిగిలినవి కోవీషీల్డ్ అని.. ఇప్పుడు వ్యాక్సినేష‌న్ కొర‌త ఎప్పుడు తీరుతుందో తెలియ‌దు అన్నారు.

ఇక‌, దేశంలో వ్యాక్సిన్ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం నేపథ్యంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్‌ ఇవ్వొచ్చని అంచ‌నా వేసిన ఆయ‌న‌.. ఆ మేరకు వారికి వాక్సినేషన్‌ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుంద‌న్నారు.. అంటే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్‌ చేయగలుగుతామ‌న్నారు.. ఇదీ వాస్తవ పరిస్థితి అని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం.. కాబట్టి వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి.. అందుకే శానిటేషన్‌ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల‌ని ఆదేశించారు.

-Advertisement-వ్యాక్సిన్ స‌మ‌స్య ఎప్పుడు తీరుతుందో తెలియ‌దు..!

Related Articles

Latest Articles