నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని నివాసం నుంచి బ‌య‌లుదేరి 11 గంట‌ల‌కు పోల‌వ‌రం చేరుకుంటారు.  ఉద‌యం 11:10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించ‌నున్నారు.  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటిగంట వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.  ఈ స‌మీక్షా స‌మావేశం అనంత‌రం మ‌ధ్యాహ్నం 2:15 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసానికి చేరుకుంటారు.  గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా పోల‌వరం ప్రాజెక్టుకు వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది.  ప్రాజెక్టులోకి వ‌ర‌ద‌నీరు చేర‌డంతో ప‌నులు మంద‌గించాయి. ఈ ఏడాది జూన్ నాటికి పోల‌వ‌రంను పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నా క‌రోనా, నిధుల కొర‌త కార‌ణంగా ఆల‌స్యం అయింది.  

Read: జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-