దిశాయాప్ ఉంటే… మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే…

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఏపీ ప్ర‌భుత్వం దిశా చ‌ట్టాన్ని తీసుకొచ్చింది.  ఇప్పుడు ప్ర‌భుత్వం దిశాయాప్‌ను రూపోందించింది.  ఈ యాప్ ప్రచార కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.  కృష్ణాజిల్లాలోని గొల్ల‌పూడిలో దిశాయాప్ ప్రచార కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ప్ర‌భుత్వం రూపోందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుంద‌ని, ప్ర‌తి మ‌హిళ దిశాయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని అన్నారు.  

Read: ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేదం… అతిక్ర‌మిస్తే జైలు శిక్ష‌…

దిశాయాప్‌పై ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేయాల‌ని తెలిపారు.  వాలంటీర్ల ద్వారా మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌.  ప్ర‌కాశం బ్యారేజ్ ద‌గ్గ‌ర జ‌రిగిన ఘ‌టన త‌న‌ను క‌లిచివేసింద‌ని, ఈ యాప్  మ‌హిళ‌ల మొబైల్ ఫోన్‌ల‌లో ఉంటే మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే అని సీఎం వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  2020 ఫిబ్ర‌వ‌రిలో దిశాయాప్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 17 ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.  

-Advertisement-దిశాయాప్ ఉంటే... మీ అన్న తోడుగా ఉన్న‌ట్టే...

Related Articles

Latest Articles