ఏపీ రాజ‌ధానిపై సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న‌: మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత మెరుగైన బిల్లు తీసుకొస్తాం..

ఏపీ రాజ‌ధానిపై సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  రాజ‌ధాన‌ల వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే మూడు ప్రాంతాల‌కు న్యాయం చేసేలా మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ ప్రారంభ‌మై ఉంటే ఈరోజుకు మంచి ఫ‌లితాలు ఉండేవ‌ని, నాటి శ్రీభాగ్ ఒడంబ‌డిక స్పూర్తితో వెన‌క‌బ‌డ్డ ఉత్త‌రాంధ్ర స‌హా అన్ని ప్రాంతాలు కూడా స‌మాన అభివృద్ది చెందాల‌న్న అకాంక్ష‌తో వికేంద్రీక‌ర‌ణ బిల్లుల్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు సీఎం వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.

Read: అన్ని సంస్థ‌లు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది చెంద‌దు: బుగ్గ‌న‌… 

హైద‌రాబాద్ వంటి సూప‌ర్ క్యాపిట్ మోడ‌ల్ వ‌ద్ద‌ని అటువంటి చారిత్ర‌క త‌ప్పిదానికి ప్ర‌భుత్వం పాల్ప‌డ‌రాద‌ని ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టం చేసింది.  కాబ‌ట్టే వికేంద్రీక‌ర‌ణే స‌రైన విధానం అన్న‌ది బ‌లంగా న‌మ్మి అడుగులు ముందుకు వేసిన‌ట్టు సీఎం తెలిపారు.  అన్నిప్రాంతాలు, అన్నికులాలు, అన్ని మ‌తాలు వీరంద‌రి ఆశ‌లూ ఆకాంక్ష‌లను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని అన్నారు.   వికేంద్రీక‌ర‌ణ‌కు సంబంధించి అనేక అపోహ‌లు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయ‌ప‌ర‌మైన వివాదాలపై ప్ర‌చారాలు జ‌రిగాయని, అంద‌రికీ న్యాయం చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వం ఉద్దేశమ‌ని సీఎం తెలిపారు.  

మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి బిల్లుల్లోని ప్ర‌భుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివ‌రించేందుకు చ‌ట్ట‌ప‌రంగానీ, న్యాయ‌ప‌రంగాగానీ అన్ని స‌మాధానాల‌ను బిల్లులోనే పొందుప‌ర‌చేందుకు బిల్లుల్ని మ‌రింత మెరుగుప‌రిచేందుకు, అన్ని ప్రాంతాల‌కు, అంద‌రికీ విస్తృతంగా వివ‌రించేందుకు ఇంకా ఏవైనా మార్పులు వాటిని కూడా పొందుప‌రిచేందుకు ఇంత‌కు ముందు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంద‌ని, అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మ‌ళ్లీ పూర్తి, స‌మ‌గ్ర‌మైన మెరుగైన బిల్లుతో స‌భ ముందుకు వ‌స్తుంద‌ని సీఎం స‌భ‌లో పేర్కొన్నారు.  

Related Articles

Latest Articles