గవర్నర్‌కు సీఎం పరామర్శ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

అస్వస్థతకు గురై హైదరాబాద్‌ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను మరోసారి పరామర్శించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడానని.. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌. కాగా, అస్వస్థతకు గురైన గవర్నర్‌ను నిన్న ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌కు చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Latest Articles