స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సీఎం జగన్‌ భేటీ.. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు.. క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్నారు.. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందని తెలిపిన ఆయన.. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందని.. మొదటి త్రైమాసికంలో ఏకంగా 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయిందని.. 2020–21లో దేశ జీడీపీ 7.25శాతం మేర తగ్గితే.. ఏపీలో 2.58శాతానికి పరిమితమైందన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందనలు తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. రాష్ట్రంలో గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని వెల్లడించిన ఆయన.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ
చేశారు.. పంటరుణాలు మాత్రం 10.49శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం అన్నారు.. ఇక, కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు సీఎం వైఎస్‌ జగన్‌.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-