వైఎస్సార్‌ ఘాట్ వద్ద వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు..

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆయన.. వైఎస్‌ సమాధి దగ్గర నివాళులర్పించారు.. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల, వైఎస్ భారతి, వారి కుటుంబసభ్యులు, పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురైన సీఎం వైఎస్‌ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది.” అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-