పండగ ప్రాముఖ్యతను వివరిస్తూ… సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరించారు. మనదైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ఉన్న ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని సీఎం జగన్ అన్నారు.

Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని జగన్ అభిప్రాయపడ్డారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి పండగను ప్రతి ఒక్కరూ కరోనా ఆంక్షలను అనుసరిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles