మా ప్రభుత్వానికి 100కు 97 మార్కులు వచ్చాయి: జగన్

ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: వైఎస్ వివేకా కేసులో మరో నిందితుడు అరెస్ట్ 

ప్రజలు ప్రభుత్వానికి 100కు 97 మార్కులు వేశారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Related Articles

Latest Articles