మాకు కేటాయించిన నీటిని మేము తీసుకుంటే తప్పేంటి : సీఎం జగన్

నీటి విషయంలో చంద్రబాబు ఈ మధ్య మాట్లాడుతున్నారు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబుకి, తెలంగాణ మంత్రులకి చెప్పేది ఏమిటి అంటే… తెలంగాణ, రాయలసీమ, కోస్తా కలిసి ఉండేదే ఆంధ్రప్రదేశ్. దశాబ్దాలుగా ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు అని తెలిసిందే. రాయలసీమ పరిస్థితి గమనించండి. 854 అడుగులు శ్రీశైలంలో ఉంటేనే గతంలో నీళ్లు వచ్చేవి. గతంలో ఎన్ని రోజులు డ్యామ్ లో 881 అడుగులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి కి నీరు 800 అడుగులో తీసుకునే అవకాశం ఉంది. 800 లోపే కరెంటు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మాకు కేటాయించిన నీళ్లు 800 అడుగులో వాడుకుంటే తప్పేముంది అని అన్నారు.

ఇక చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో పాలమూరు డిండి, కల్వకుర్తి కడుతుంటే ఏమి గాడిదలు కాశావు అని ప్రశ్నించారు. జగన్ సీఎం గా.. ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే.. ఏ రాష్ట్రం తో తగాదాలు పెట్టు కోదల్చుకోలేదు. పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టలేదు. పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం. బిటి ప్రాజెక్టు విస్తరణ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కి విస్తరణ… హంద్రీనీవా 36 వ ప్యాకేజీ పనులు వీలైనంత త్వరగా చేపడతాం అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-