రేపు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రేపు ఢీల్లీ వెళ్ల‌నున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు.  పోల‌వరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులు, పెండింగ్‌లో ఉన్న అంశాల‌పైన‌, విభ‌జ‌న చ‌ట్టంలో అమ‌లు చేయాల్సిన హామీల పైన సీఎం వైఎస్ జ‌గ‌న్ కేంద్ర మంత్రి షాతో చ‌ర్చించ‌బోతున్నారు.  షాతో భేటీ త‌రువాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్ర‌మంత్రుల‌తో కూడా సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు.  క‌రోనా కారణంగా పోల‌వ‌రం నిర్మాణం పనులు అనేకం పెండింగ్‌లో ప‌డిపోయాయి.  ఈ ఎడాది జూన్ నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా తగ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న‌ది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-