చంద్రబాబు, లోకేష్ రాబందుల్లా మారిపోయారు..!

చంద్రబాబు, లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌ రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెన్షన్ల విషయంలో ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నాం.. సుమారు 3 లక్షల పెన్షన్లని వెరిఫికేషన్ కోసం పెట్టారని.. 3 లక్షల పెన్షన్లను తొలగించినట్టు కాదు.. ప్రస్తుతం జరిగేది పరిశీలన మాత్రమే అని.. ఇందులో కూడా అర్హులైన వారికి పెన్షన్ అందుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక, కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని పెన్షన్లు కట్ చేస్తున్నారనే విమర్శలు సరికావన్న శ్రీకాంత్‌రెడ్డి.. డబ్బులున్న వారికే ఎక్కువ కరెంట్ వినియోగం జరుగుతుంది కాబట్టే లబ్దిదారుల ఎంపికలో విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామన్న ఆయన.. రాష్ట్రంపై చంద్రబాబు, లోకేష్ రాబందుల్లా వాలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పెన్షన్ కట్ చేసే పరిస్థితే వస్తే.. ఎందుకు కట్ చేయాల్సి వస్తుందోననే అంశాన్ని స్పష్టంగా చెబుతామని క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్‌రెడ్డి.

Related Articles

Latest Articles

-Advertisement-