ఏపీలో కరోనా అప్డేట్… ఇవాళ ఎన్నంటే?

ఏపీలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1186 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20, 15, 302 కి చేరింది. ఇందులో 19 ,86 , 962 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా… 14, 473 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఏపీలో 10 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనాతో ఇప్పటి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 13, 867 కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 1396 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-