భవిష్యత్తులో జనసేనతో కలిసే వెళ్తాం : సోము వీర్రాజు

బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేనను పోటీ చేయాలని కోరినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పింది అని వివరించిన ఆయన కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం… కాబట్టి బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరాం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందో లేదోననే అంశంపై ఆ పార్టీతో చర్చిస్తాం. కనైన్ భవిష్యత్తులో జనసేనతో కలిసే వెళ్తాం అని స్పష్టంగా తెలిపారు. అయితే బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం అన్న ఆయన మేం అభివృద్ధి చేస్తున్నాం.. ప్రభుత్వం అవినీతి చేస్తోంది.. ఇదే మా ఎన్నికల అజెండా అని పేర్కొన్నారు.

-Advertisement-భవిష్యత్తులో జనసేనతో కలిసే వెళ్తాం : సోము వీర్రాజు

Related Articles

Latest Articles