రేపు పోలవరంలో ఏపీ బీజేపీ చీఫ్ పర్యటన

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోను ఆయన పర్యటన కొనసాగనుంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని.. వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌, జగన్‌లు పగలు పోరాటం.. రాత్రి వెన్నెల్లో దోస్తీ నడుపుతున్నారని విమర్శించారు. జలవివాదాల విషయంలో ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-