ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అర్థం మారుస్తోంది…

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు నేషనల్ హెల్త్ మిషనులో పని చేసిన ఉద్యోగులు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి తొలగించిందని సోము వీర్రాజుకు వివరించారు బాధితులు. కరోనా రెండు సీజన్లల్లో కష్టపడి పని చేస్తే ప్రభుత్వం మాఉద్యోగాలు ఊడగొట్టిందని సోము వీర్రాజు వద్ద బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కొత్త నోటిఫికేషన్ వేస్తుందనే విషయాన్ని వీర్రాజు దృష్టికి తెచ్చారు బాధిత ఉద్యోగులు.

అక్కడ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ… ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అర్థం మారుస్తోంది అన్నారు. ఉన్న ఉద్యోగులను తొలగించి కొత్త ఉద్యోగాలకు నోటి ఫికేషన్లు విడుదల చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం ఇంతటి సాహసం చేయలేదు. నిత్యం ప్రజలకు సేవ చేసే విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను ఒక కలం పోటుతో తొలగించడం దారుణం అని తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుండి తొలగించడం ఏమిటీ అని ప్రశ్నించారు.

Related Articles

Latest Articles