జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది..

వినాయక చవితి మీద విధించిన ఆంక్షలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగర్హం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రంజాన్, క్రిస్మస్, మొహారం పండుగలపై లేని ఆంక్షలు వినాయక చవితిపై ఎందుకు అని అడిగారు. చర్చిలో ప్రార్థనలు, టీటీడీ లో దర్శనాలు, బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించారు కదా…. వినాయక విగ్రహాలు ఆలయాల్లో పెడితే తప్పా… ఇళ్లల్లో పూజలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పాలా… ఇళ్లలో పూజలకు ప్రభుత్వ అనుమతి అవసరమా అన్నారు.

అలాగే వినాయకచవితిపై ప్రభుత్వ నిర్ణయం, డీజీపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేదంటే ఇవాళ 4 గంటల నుంచి నిరవధిక నిరసన అని తెలిపారు. మొహారం, రంజాన్, క్రిస్టమస్ పడుగలపై ఇలాగే ఆంక్షలు పెట్టగలరా. కోవిడ్ నిబంధనలు హిందువుల పండగలకేనా… ఐటీజ్ మతాల పండుగలకు వర్తించవా.. వినాయక విగ్రహాలు బయట ఏర్పాటు చేస్తే అరెస్ట్ చేస్తామంటారా.. అరెస్ట్ లకు హిందువులు భయపడరు..హిందువులు పిరికిపంధలు కాదు అని పేర్కొన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-