వైసీపీ మత రాజకీయాలు చేస్తోంది.. బీజేపీ కాదు..!

మత రాజకీయలు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీయే… బీజేపీ కాదన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సోము వీర్రాజు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. కరోనావైరస్‌ కేవలం వినాయక చవితి కేనా…? అని ప్రశ్నించిన ఆయన.. చర్చిలకు, మసీదులకు, స్కూళ్లకు లేదా? అంటూ ప్రశ్నించారు.. మంత్రి వెల్లంపల్లి దేవాదాయశాఖ మంత్రా..? లేక దర్గాల మంత్రా..? అంటూ ఫైర్‌ అయిన సోము వీర్రాజు.. పాస్టర్లకు జీతాలు ఇస్తే, మత గ్రంథాలు జేబులో పెట్టుకుని తిరిగితే మతతత్వం కాదు.. కానీ, మేం వినాయక చవితి గురించి మాట్లాడితే మత తత్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మత రాజకీయలు చేస్తోంది వైసీపీనే.. బీజేపీ కాదన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-