ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పాలి…

ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమైన ఏపీ ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణ ప్రకటించాయి. ఇక తాజాగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఉద్యమానికి వెళ్లాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుంది. ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరిదగ్గరకూ తిరిగాం. ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. దాని పై స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చూస్తున్నారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఉద్యోగులను బాధించింది కరోనా సమయంలోనూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాం. విధిలేని పరిస్థితుల్లో ఉద్యమ బాట పడుతున్నాం. పీఆర్సి నివేదికను బయటపెట్టడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు.

Related Articles

Latest Articles