వారి పై కోహ్లీ ఆగ్రహం.. ఫోటోలు వైరల్

డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విరుష్క కూతరు వామికా కోసం ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిన్నారినే టార్గెట్ చేస్తూ ఫోటోలు తీశారు. కానీ వామిక ముఖం బయట పడకుండా అనుష్క బిడ్డను గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది. అదే సమయంలో మరోవైపు విరాట్ కోహ్లీ ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వారి వైపు సిరీయస్‌గా చూశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ ఫొటోగ్రాఫర్లపై మండిపడుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-