నవీన్ పోలిశెట్టికి హ్యాండ్ ఇచ్చిన స్వీటీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శెట్టి ఇటీవలికాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. బాహుబలి, ఓ అరుంధతి వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ‘నిశ్శబ్దం’ సినిమాతో అమెజాన్‌లో దర్శనం ఇచ్చినా అంతగా ఆదరణ దక్కలేదు. అయితే ఆమధ్య సరికొత్త కథాంశంతో ఇప్పటివరకు తెలుగు తెరపై టచ్ చెయ్యని సబ్జెక్ట్‌తో అనుష్క సినిమా తియ్యబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఈ సినిమాలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో సత్తా చాటి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్నాడు. ఈ వార్త అధికారికంగా రాకపోయినను దాదాపుగా ఖరారు అయినట్లుగానే ప్రచారం నడిచింది.

అయితే తాజా సమాచారం ప్రకారం స్వీటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ఆమెకు బాగానే నచ్చినప్పటికీ, ఎందుకో వెనకడుగు వేసిందట. ప్రస్తుతం అనుష్క చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఆమె పెళ్లిపై కూడా వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో, మహేశ్.పి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో వేరే కథానాయికను చూస్తారా.. లేదా ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేస్తారా.. అనేది చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-