అనుష్క-నవీన్ పోలిశెట్టి చిత్రానికి వెరైటీ టైటిల్!

నవీన్‌ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమా విజయం తర్వాత ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే నవీన్‌, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సరసన నటించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి’ అనే వెరైటీ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారట. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-