‘యాంజియోప్లాస్టీ’ సర్జరీ తరువాత క్రమంగా కోలుకుంటోన్న అనురాగ్ కశ్యప్

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి డాక్టర్స్ సర్జరీ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఛాతిలో కొంచెం నొప్పి కారణంగా హాస్పిటల్ కి వెళ్లారు. మొదట ‘యాంజియోగ్రఫీ’ పరీక్ష నిర్వహించిన వైద్యులు హార్ట్ లో కొన్ని బ్లాకేజెస్ గుర్తించారు. అందుకే, శస్త్ర చికిత్స తప్పదనటంతో అనురాగ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. హృద్రోగ నిపుణులు ఆయనకు ‘యాంజియోప్లాస్టీ’ సర్జరీ చేశారు. ప్రస్తుతం కశ్యప్ పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కార్యదర్శి మీడియాకి తెలియజేశాడు. కాకపోతే, వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఆయన తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘దోబారా’ సినిమా ఇప్పటికే పూర్తి చేశారు. ఆ థ్రిల్లర్ మూవీ నెక్ట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-