‘రౌడీ బాయ్స్’ అనుపమను ఆదుకుంటారా!?

అలలా ఎగసి పడింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అయితే మళ్ళీ పైకి లేవటం లేదు. ఈ ప్రతిభావంతులైన కథానాయిక కెరీర్‌లో సరైన సక్సెస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అనుపమను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ తెలుగులో తొలి సినిమా ‘అ ఆ’తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు ‘ప్రేమమ్’తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఇక ‘శతమానంభవతి’తో స్టార్ గా ఎదిగింది. అయితే ఆ తర్వాత రామ్ తో ‘ఉన్నది ఒకటే జిందగి’, నానితో ‘కృష్ణార్జునయుద్ధం’, సాయిధరమ్ తో ‘తేజ్ ఐ లవ్ యు’, మళ్ళా రామ్ తో ‘హలో గురు ప్రేమకోసమే’, బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ సినిమాలు చేసింది. వీటిలో కొద్దో గొప్పో ‘రాక్షసుడు’ పర్వాలేదనిపించినా అనుపమకు ఒరిగింది ఏమీ లేదు.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ సాఫీగా సాగాలంటే ఇప్పుడు ఆమెకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న దిల్ రాజు ‘రౌడీ బాయ్స్‌’పై అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీంట్లో దిల్ రాజు సోదరుడి కొడుకు హీరోగా నటిస్తున్నాడు. అంతే కాదు ఇందులో కొత్త హీరోతో లిప్ లాక్స్ మాత్రమే కాదు డ్యాన్స్ నంబర్స్ కూడా చేసింది అనుపమ. సంక్రాంతి సెంటిమెంట్ కూడా యాడ్ అవుతోంది. గతంలో సంక్రాంతికి వచ్చిన దిల్ రాజు సినిమా ‘శతమానంభవతి’ ఆమె కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా. ఆ సెంటిమెంట్ మరోసారి తనను కాపాడుతుందని అనుపమ నమ్ముతోంది. ఇది కాకుండా అనుపమ నిఖిల్ తో బ్యాక్ టు బ్యాక్ ’18 పేజీలు’, ‘కార్తికేయ 2’ సినిమాలతో పాటు మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్ లో కూడా నటిస్తోంది. మరి రాబోయే ఈ సినిమాలతో అనుపమ మునపటి ఫామ్ ను అందిపుచ్చుకుంటుందో లేదో చూద్దా

Related Articles

Latest Articles