ఫన్ ఫిల్డ్ టీజర్ “అనుభవించు రాజా”

యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం “అనుభవించు రాజా”. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫై సంయుక్తంగా ఈ కామిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాయి. రామ్ చరణ్ తాజాగా “అనుభవించు రాజా” టీజర్‌ను ఆవిష్కరించారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన చరణ్… సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి విషెస్ చెప్పారు. ఈ టీజర్ సరదాగా, వినోదభరితంగా ఉంది. కోడిపందాలకు ప్రసిద్ధి చెందిన భీమవరం నేపథ్యంలో “అనుభవించు రాజా” తెరకెక్కింది. రాజ్ తరుణ్ ఇందులో పూర్తి జూదగాడు పాత్రలో నటించాడు. అసలేం పని చేయకుండా తన స్నేహితులతో తిరగడానికి, కేవలం కోడి పందాల కోసం ఆరాటపడే యువకుడిగా రాజ్ తరుణ్ కనిపించబోతున్నాడు.

Read Also : చిరు 43 ఏళ్ళ ప్రయాణం… చరణ్ స్పెషల్ ట్వీట్

టీజర్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. గత కొంతకాలం నుంచి హిట్ అనే మాటకు దూరమైన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇక మరోవైపు “స్టాండ్ అప్ రాహుల్” అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రీకరణ కూడా పూర్తి చేసారు రాజ్ తరుణ్. ఈ చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే “అనుభవించు రాజా” రాజ్ తరుణ్ కు హిట్ ఇచ్చేలాగే కన్పిస్తోంది. విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ఫన్ ఫిల్డ్ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

-Advertisement-ఫన్ ఫిల్డ్  టీజర్ "అనుభవించు రాజా"

Related Articles

Latest Articles