ఆ ప్రకటనలకు ఇక దూరం.. అమితాబ్ నిర్ణయంపై ప్రశంసలు

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్ మసాలాను అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తుండడంతో ఓ యాంటీ-టొబాకో సంస్థ ప్రచారం ఆపాలని అతనికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రజారోగ్యం కోసం బిగ్ బి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి సలాం బాంబే, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, హీలీస్ షేక్ శారియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వంటి సంస్థలు.

పొగరాకుండా నమిలే ఖైనీ, గుట్కా ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తోంది. ఇలాంటి పాన్ మసాలాను ప్రమోట్ చేయకూడదని బిగ్ బీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు, వ్యాధులకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం దాదాపు 1.35 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని సంస్థ తెలిపింది. వీటినుంచి యువతను రక్షించేందుకు యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో గత నెలలో భారత సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖ రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది.

ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రకటనల నుంచి అంగీకరించవద్దని కోరింది. ఈ మేరకు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ బిగ్‌బీకి లేఖ రాశారు. అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారని… అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. వీలైనంత త్వరగా అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలని… అప్పుడు పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు దోహదపడినట్టవుతుందని చెప్పారు. ఈ లేఖపై స్పందించిన అమితాబ్ పాన్ మసాలా ప్రకటనలనుంచి వైదొలిగారు.

Related Articles

Latest Articles