ఎన్ని వేల టన్నులు కొన్నారో సమాధానం చెప్పాలి : కళావెంకటరావు

ఏపీలో రైతులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూర్‌ సభ్యులు కళావెంకటరావు అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో రైతులు 80 శాతం వరి పంట పై ఆధారపడ్డవారున్నారన్నారు. ఈరోజు రైతులు లబోదిబోమంటున్నాని ఆయన అన్నారు. పండగ చేసుకునే పరిస్దితి లేదని, ఎప్పుడైనా రైతుకళ్ళల్లో కన్నీరు వస్తుంటుంది, జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కళ్ళలో రక్తం వస్తుందని ఆయన విమర్శించారు.

ఐదేళ్ల క్రిందట వ‌రి పంట రైతులు వద్ద ధాన్యం బస్తా రూ.1200 ఉంటే.. నేడు ధాన్యం బస్తా రూ.1100 కూడా కొనే పరిస్థితిలో లేరని ఆరోపించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్ర పెట్టామంటుంది.. ఎక్కడ‌? ఎవరు కొంటున్నారు ? ఎన్ని వేల టన్నులు కొన్నారో సమాధానం చెప్పాలి..? అంటూ ప్రశ్నలు కురిపించారు. ఈ ప్రభుత్వంలో వరిధాన్యాన్ని కూడా తగల పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

Related Articles

Latest Articles