తెలుగు అకాడమీ స్కాంలో మరో ట్విస్ట్ !

తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లోని రెండు సంస్థ ల నుంచి సాయి కుమార్ ముఠా డబ్బులు కొట్టేసినట్టు తేలింది. ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ 10 కోట్ల రూపాయలు కోట్టేసిన సాయికుమార్… ఆంధ్ర ప్రదేశ్ సీడ్స్‌ కార్పొరేషన్ నుంచి ఐదు కోట్ల ఎఫ్‌డీలను డ్రా చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రెండు సంస్థ ల నుంచి మొత్తం 15 కోట్ల రూపాయలను సాయికుమార్ డ్రా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఏపీ సంస్థల సంబంధించిన డిపాజిట్లను ఐఓబి బ్యాంక్ నుంచి బదలీ చేయించుకుంది సాయికుమార్‌ ముఠా. ఐఓబి నుంచి ఏపీ మర్కంటైల్ కోపరేటివ్ సొసైటీ కి నిధులు బదలీ చేయించుకుని.. ఆ తర్వాత విత్ డ్రా చేసింది ఈ గ్యాంగ్‌. ఏపీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కాజేసి నట్లుగా గుర్తించిన సిసిఎస్ పోలీసులు…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సాయికుమార్ ముఠాపై 2 కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఏపీ పోలీసులు. మరోవైపు, తెలుగు అకాడమీలో మాయమైన 60 కోట్ల రూపాయల రికవరీ పై దృష్టి పెట్టారు పోలీసులు.

-Advertisement-తెలుగు అకాడమీ స్కాంలో  మరో ట్విస్ట్ !

Related Articles

Latest Articles