రాజ్ కుంద్రా కేసులో వెలుగులోకి మరో ట్విస్ట్… !

అశ్లీల చిత్రాలు నిర్మాణం, యాప్ ల ద్వారా షేర్ చేయడం వంటి ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ జూలై 27న ముగియనుంది. అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసుల ద్వారా రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కాన్పూర్ లోని రాజ్ కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోవాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముంబై క్రైమ్ బ్రాంచ్ రిక్వెస్ట్ చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ కావడంతో ఆదివారం ఎస్బిఐ అధికారులు రాజ్ ఖాతాలను సీజ్ చేశారు. అనంతరం మరో కేసు వెలుగులోకి వచ్చి ట్విస్ట్ ఇచ్చింది.

Read Also : ఎన్టీఆర్ రిలీజ్ చేసిన “తిమ్మరుసు” ట్రైలర్

రాజ్ కుంద్రాకు చెందిన నిర్మాణ సంస్థను అరవింద్ శ్రీవాస్తవ అనే వ్యక్తి నడుపుతున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఆ డబ్బును అరవింద్ శ్రీవాత్సవ భార్య హర్షిత ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు. ఈ విషయంపై అరవింద్ తండ్రి ఎస్.పి శ్రీవాత్సవ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు గత రెండేళ్ల నుంచి ఇంటికి రావట్లేదని, కానీ ఖర్చుల కోసం మాత్రం డబ్బులు పంపుతూ ఉంటాడు అని, 2021 ఫిబ్రవరిలో అరవింద్ కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. హర్షిత అకౌంట్లో డబ్బు జమ అవుతున్న విషయం గురించి తనకసలు తెలియదని చెప్పుకొచ్చారు. ఇక ఈ రోజు మరోసారి పోలీసులు రాజ్ ను కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఆయన బెయిల్ విచారణ కూడా జరుగుతుంది. పోలీసులు సమర్పించే ఆధారాలను బట్టి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో? రాజ్ కు బెయిల్ లభిస్తుందా? అనేది వేచి చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-