‘మా’ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్

‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు బృందం ప్రమాణ స్వీకారం చేసి ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ గెలిచిందని ప్రకటించిన మరుసటి రోజే రాజీనామాల పర్వం మొదలైంది. ప్రకాష్ రాజ్ తో సహా ఆయన ప్యానల్ సభ్యులు, ఆయనకు సపోర్ట్ చేసిన నాగబాబు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ‘మా’ ఎన్నికలలో దౌర్జన్యం చోటు చేసుకుందని కొత్త నాటకానికి తెర తీశారు. ఎన్నికల సమయంలో సీసీటీవీ ఫుటేజ్ చూశాక కోర్టుకు వెళ్తామని అన్నారు. మంచు విష్ణు బృందం తిరుమల సందర్శనలో ఉండగానే ఇక్కడ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ ను చూశారు. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ వచ్చింది.

Read Also : భారీ రేటుకు అమ్ముడైన “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్

‘మా’ ఎన్నికల సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారంటూ ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. రౌడీ షీట్ ఉన్న బయటి వ్యక్తులు ‘మా’ ఓటర్లను బెదిరించారంటూ ఆరోపించారు ప్రకాష్ రాజ్. తన ఫిర్యాదులో కౌంటింట్ హాల్లో నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో సాంబశివరావుపై రౌడీ షీట్ ఉందని, ఓ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడని, గతంలో ముగ్గురు ఎస్సై లను కొట్టినట్లుగా ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. 14వ తేదీని ఎన్నికల అధికారికి ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఫలితం లేదని అన్నారు ప్రకాష్ రాజ్. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles