మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో మరో స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ ఫాదర్’ రూపొందనుంది. అంతేకాదు త్వరలో కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే మాస్ ఎంటర్‌టైనర్ ను కూడా ప్రారంభించబోతున్నారు. మెగాస్టార్ ను బాబీ స్క్రిప్ట్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ పప్రాజెక్ట్ కు ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని అంటున్నారు. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు

ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే… ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కోసం టాలీవుడ్ నటుడు రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి అన్నయ్య, శంకరదాదా జిందాబాద్ (అతిధి పాత్రలో)లలో రవితేజ కలిసి కన్పించాడు. ఈ రూమర్స్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది చిరంజీవికి మూడు సినిమాల రిలీజ్‌లు ఉంటాయి.

-Advertisement-మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో మరో స్టార్ హీరో

Related Articles

Latest Articles