మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీజేఐ ఎన్.వి. రమణ…

మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీజేఐ ఎన్.వి. రమణ. “గే” ని జడ్జిగా నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్‌ సౌరభ్‌ కిర్‌పాల్‌ పేరు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా సౌరభ్‌ కిర్‌పాల్‌ పై నిర్ణయం తీసుకోలేదు కొలీజియం. సౌరభ్‌ కిర్‌పాల్‌ మాజీ సీజేఐ బీఎన్‌ కిర్‌పాల్‌ కుమారుడు. 2017లో మొదటిసారి సౌరభ్‌ కిర్‌పాల్‌ పేరును సిఫార్సు చేసింది ఢిల్లీ హైకోర్టు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని, జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు సౌరభ్‌ కిర్‌పాల్‌. కానీ “గే” తో సహజీవనం చేస్తున్న కారణంగా సౌరభ్‌ కిర్‌పాల్‌ పేరును పక్కన పెట్టింది కేంద్రం. కానీ తాజాగా “గే” హక్కుల కోసం సుప్రీంలో పోరాడి విజయం సాధించారు సౌరభ్‌ కిర్‌పాల్‌.

Related Articles

Latest Articles