ఫ్రాన్స్‌లో మ‌రో కొత్త వేరియంట్‌: ఒమిక్రాన్‌ను మించేలా…!!

ప్ర‌పంచం మొత్తం ప్ర‌స్తుతం క‌రోనా, ఒమిక్రాన్ కేసుల‌తో అల్ల‌కల్లోలంగా మారింది.  క‌రోనా ధాటికి యూర‌ప్‌, అమెరికా దేశాలు అతలాకుత‌లం అవుతున్నాయి.  ముఖ్యంగా అమెరికాలు రోజువారీ కేసులు ల‌క్ష‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో మ‌రో కొత్త వేరియంట్ పుట్టుకువ‌చ్చింది.  కొత్త వేరియంట్ బి.1.640.2 గా గుర్తించారు.  కామెరూన్ నుంచి వ‌చ్చిన వారి ద్వారా ఈ వేరియంట్ ఫ్రాన్స్‌లోకి ప్ర‌వేశించింది.  

Read: ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూ…

ఇప్ప‌టికే 12 మంది ఈ వేరియంట్ బారిన ప‌డిన‌ట్టు ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు.  కొత్త వేరియంట్‌లో 45 కొత్త మ్యూటేష‌న్లు ఉన్న‌యని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఒమిక్రాన్‌ కంటే డేంజ‌ర్ అని, అయితే, ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తుండ‌టంతో దానిపైనే ప్ర‌పంచం దృష్టిసారించిన‌ట్టు ఫ్రాన్స్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఒక‌వేళ ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెంద‌డం మొద‌లుపెడితే ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.  

Related Articles

Latest Articles