కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలను తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి  జితేంద్ర సింగ్ కి ఒక లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు మరియు ఇతర శాఖలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతున్నారని అయితే ఈ పరీక్షలను కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లో నిర్వహించడం ద్వారా  ఉద్యోగార్ధులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

read also : కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్యపై వెంకయ్య నాయుడు చొరవ

ఆంగ్ల మాధ్యమం చదివిన విద్యార్థులు మరియు హిందీ మాట్లాడని ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు గతంలో ఒకసారి గౌరవ ప్రధాన మంత్రికి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హిందీ మరియు ఇంగ్లీష్ తో  పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని  ఈ సందర్భంగా లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-