ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు చేస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనుంది. గతంలో సంవత్సరం జనవరిలో శాసన మండలిని రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ తీర్మానానికి 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హజరుకాకపోవడంతో ఈ తీర్మానంపై వ్యతిరేకంగా ఓట్లు రాలేదు.

దీంతో ఆ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం మరో తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఏపీలో సంచలనం సృష్టించిన మూడు రాజధానుల చట్టాన్ని కూడా ఏపీ ప్రభుత్వం నిన్న ఉపసంహరించుకుంది. అయితే మరోసారి కొన్ని మార్పులతో మూడు రాజధానుల చట్టాన్ని తీసువస్తామంటూ వైసీపీ తెలిపింది.

Related Articles

Latest Articles