తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో గుడ్‌న్యూస్ అందించింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలలోని ప్రిన్సిపాళ్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.

Read Also: ఈ ఏడాది నాంపల్లి నుమాయిష్ పూర్తిగా రద్దు

మరోవైపు ఫెయిలైన విద్యార్థులను ప్రభుత్వ నిర్ణయం మేరకు పాస్ చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో ముఖ్య సూచన చేసింది. విద్యార్థులందరూ శుక్రవారం నుంచి మార్కుల మెమోలను పొందవచ్చని సూచించింది. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నుంచి మార్కుల మెమోలను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

Related Articles

Latest Articles