బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలో విస్తారంగా.. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న ఏర్పడే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతానికి ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతోందని.. అల్పపీడన ప్రభావంతో విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది… తీరం వెంబడి ఈదురు గాలులు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

ఇక, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ.. ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని.. తీరం వెంబడి ఈదురు గాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందంటోంది.. ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణశాఖ.

Related Articles

Latest Articles

-Advertisement-