అన్నమయ్య ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేయాలి : సీఎం జగన్ ఆదేశాలు

అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్‌ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్‌ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసేలా అప్పుడు డిజైన్‌ చేశారని సీఎం పేర్కొన్నారు. కాని దురదృష్టవశాత్తూ ఇప్పుడు 3.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని… 2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం విధానాల కారణంగా ఇలాంటి పరిస్థితుతులు ఉన్నాయని సీఎం జగన్‌ ఫైర్‌ అయ్యారు. ఇవాళ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు పట్టించుకోలేదని… పింఛా విడుదల సామర్థ్యం 58వేల క్యూసెక్కులు అయితే, 1.38 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని పేర్కొన్నారు.

దీని పై ఉన్న అన్ని వాగులు, వంకలు కూడా ఎప్పుడూలేని విధంగా వరదనీరు వచ్చిందని… ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరద వచ్చిందని వెల్లడించారు. చెయ్యేరు వెంబడికూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని… భవిష్యత్తులో ఇలాంటి వరద వస్తుందని అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles